data
Home » డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా!

డార్క్‌వెబ్‌లో 81 కోట్ల మంది భారతీయుల డేటా!

by admin
0 comment

దాదాపు 81 కోట్ల మంది భారతీయుల పర్సనల్‌ డేటా డార్క్‌వెబ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌-19 పరీక్షల సమయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి సేకరించిన డేటాను దొంగిలించినట్లు చెబుతున్నారు. అయితే కచ్చితంగా ఇది ఎక్కడి నుంచి లీకైందనే విషయం తెలియలేదు. మరోవైపు సీబీఐ దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ‘Pwn0001’ అనే హ్యాకర్‌ ఈ డేటాను అందుబాటులోకి తెచ్చాడు. వీటిల్లో ఆధార్‌ కార్డ్‌, పాస్‌పోర్టుల సమాచారం, పేర్లు, ఫోన్‌ నంబర్లు, టెంపరరీ, పర్మనెంట్‌ అడ్రస్‌లు ఉన్నాయి. దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద డేటా లీక్‌ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్‌ 9వ తేదీన ఈ డేటా చౌర్యం తొలిసారి వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన సైబర్‌ సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్‌ సంస్థ దీనిని గుర్తించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links