cm kcr
Home » Telangana: రైతులకు తీపికబురు

Telangana: రైతులకు తీపికబురు

by admin
0 comment

రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను నేటి నుంచే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం రూ.19 కోట్లను సెప్టెంబర్‌ రెండో వారంలోపు రైతన్నలకు అందించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కక్షపూరిత చర్యలు, తదితర కారణాలతో ఆర్థికలోటు ఏర్పడిందని ఫలితంగా రుణమాఫీకి కొంత ఆలస్యమైందని సీఎం వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం మొదటగా 2014 మార్చి 31 వరకు ఉన్న రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను నాలుగు దఫాల్లో మాఫీ చేసింది. 35,31,913 మంది రైతులకు రూ.16,144.10 కోట్ల రుణమాఫీ చేసింది. అనంతరం రెండో విడతలో భాగంగా 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి 2018 డిసెంబరు 11 నాటికి రూ.లక్ష లోపు అప్పులు తీసుకున్న 42.56 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.

ఇందులో మొదటి దఫాలో రూ.25వేల లోపు బాకీ ఉన్న 2,96,571 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లను ప్రభుత్వం రద్దుచేసింది. రెండో దఫాలో రూ.50 వేలలోపు బాకీ ఉన్న 2,46,038 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.798.99 కోట్లను మాఫీ చేసింది. ఇవిపోను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణమున్న 29.11 లక్షల మంది రైతులకు రుణమాఫీ కోసం తాజాగా రూ.19 వేల కోట్లను విడుదల చేయనుంది. దీని ద్వారా తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణం అవుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links