cbn
Home » Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్‌

Chandrababu- జైలు నుంచి విడుదల.. పవన్‌కు స్పెషల్ థ్యాంక్స్‌

by admin
0 comment

టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును జైలు నుంచి మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. తన మనవడు దేవాన్ష్‌ను ముద్దాడారు. కాసేపటి తర్వాత పార్టీశ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. గత 52 రోజులుగా తన కోసం రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపినందుకు పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తనపై చూపించిన అభిమానాన్ని ఎప్పటికి మరిచిపోలేని అన్నారు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదని, చేయనివ్వనని ఆయన వివరించారు. తన అక్రమ అరెస్టును ఖండించిన రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.

మరోవైపు చంద్రబాబు విడుదలైన నేపథ్యంలో ఆయన జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఆయన కాన్వాయ్ ఉండవల్లి నుంచి రాజమండ్రికి వచ్చింది. ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ మొత్తం జైలు వద్దకు చేరుకుంది. అలాగే చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున జైలు వద్దకు వచ్చారు. కాగా, రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి వెళ్తున్నారు. అయితే చంద్రబాబు ర్యాలీ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు ర్యాలీలు చేయకుండా చూడాలని, మీడియాతో మాట్లాడవద్దని ఏపీ సీఐడీ అధికారులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రేపటి వరకూ చంద్రబాబు ఎలాంటి ర్యాలీలు చేపట్టవద్దని, మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links