nuvan
Home » Team India- త్రో స్పెషలిస్ట్‌గా బస్‌డ్రైవర్‌

Team India- త్రో స్పెషలిస్ట్‌గా బస్‌డ్రైవర్‌

by admin
0 comment

భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ ఫ్లిక్‌తో సిక్సర్‌ కొట్టాడు. అయితే అప్పుడు కెమెరాలన్నీ టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌ బాల్కనీలో నిల్చున్న ఒక వ్యక్తిపై ఫోకస్‌ పెట్టాయి. అతడిపై కెమెరాలు ఎందుకు ఫోకస్‌ పెట్టాయో ఎవరికీ తెలియదు. కానీ ఎడమచేతి వాటం పేసర్‌ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్‌ బెదురు లేకుండా ఆడటంలో అతడి కృషి కూడా ఉంది. అందుకే కెమెరాలు అతడివైపు తిరిగాయి. అతడే శ్రీలంకకు చెందిన నువాన్‌ సెనెవిరత్నె.

టీమిండియా బ్యాటర్లు ఎడమచేతి వాటం బౌలర్లను ధీటుగా ఎదుర్కోవడంలో నువాన్‌ కృషి ఎంతో ఉంది. త్రోడౌన్‌ స్పెషలిస్ట్‌గా భారత జట్టు సహాయక బృందంతో కలిసి పని చేస్తున్నాడు. వేగంతో, విభిన్న కోణాలతో బంతులు సంధిస్తూ బ్యాటర్లకు మంచి ప్రాక్టీస్‌ అందిస్తున్నాడు. అయితే క్రికెటర్‌గా ఎదగాలనుకున్న అతడు రెండు ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌లే ఆడాడు. తర్వాత బస్‌ డ్రైవర్‌గా జీవనం సాగించాడు. కానీ 2015లో మాజీ శ్రీలంక క్రికెటర్‌ చరిత్‌ను కలిసిన తర్వాత అతడి దశ తిరిగింది. నువాన్‌ త్రోలు విసిరే విధానం చరిత్‌ను ఆకట్టుకుంది. అప్పుడు లంక జట్టు మేనేజర్‌గా ఉన్న చరిత్‌.. నువాన్‌ను జట్టు సహాయక బృందంలో చేర్చుకోవాలని సూచించాడు. 2016లో భారత్‌లో పర్యటించిన శ్రీలంక- ఎ జట్టుతో కలిసి నువాన్‌ పనిచేశాడు. ఆ తర్వాత శ్రీలంక సీనియర్‌ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌కు వెళ్లాడు.

ఆ తర్వాత నువాన్‌ గురించి భారత జట్టుకు తెలిసింది. 2017లో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు నెట్స్‌లో బౌలింగ్‌ సహాయం కోసం నువాన్‌కు టీమిండియా కబురు పంపింది. ఆ సమయంలో నెట్స్‌లో తన వేగంతో కోహ్లీని అతడు ఇబ్బంది పెట్టాడు. దీంతో నువాన్‌ నైపుణ్యాలకు మెచ్చి టీమిండియా మేనేజ్‌మెంట్‌ జట్టు సహాయక బృందంలో చేర్చుకుంది. అప్పటినుంచి అతడు త్రో స్పెషలిస్ట్‌గా మారాడు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links