స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరువురు వాదనల అనంతరం విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం తెలిపింది. 17ఎ సెక్షన్‌కు సంబంధించిన వివిధ అంశాలు, మరికొన్ని కేసుల్లో వచ్చిన తీర్పులను సాల్వే ప్రస్తావించారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోసం చంద్రబాబు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు చంద్రబాబు తరఫు న్యాయవాదులు లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం వాదనలు వింటామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తెలిపింది. ఇక ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్ పిటిషన్లపై కూడా రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.
785
previous post