546
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరుగుతాయోనన్న భయంతో చాలా మంది ఎన్నారైలు ముందుగానే సూపర్ మార్కెట్లకు పరుగులు పెట్టారు. దీంతో ఇండియన్ స్టోర్స్ వద్ద బియ్యం కోసం ఎన్నారైలు ఎగబడ్డారు. అమెరికాతో పాటు కెనడాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
కాగా, బియ్యం ఎగుమతులపై నిషేధం నేపథ్యంలో కొన్ని స్టోర్లు ధరలను భారీగా పెంచేశాయి. 18 డాలర్లుగా ఉండే 20 పౌండ్ల బియ్యం బ్యాగ్ ధరను ఏకంగా 50 డాలర్లకు పెంచి విక్రయిస్తున్నట్లు పలువురు ఎన్నారైలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.