hair
Home » హఠాత్తుగా జుట్టు ఊడిపోతుందా?

హఠాత్తుగా జుట్టు ఊడిపోతుందా?

by admin
0 comment

ఈ జనరేషన్‌లో జుట్టు రాలిపోవడం సాధారణ సమస్యగా మారింది. తినే ఆహారం, కలుషిత నీటి, పోషణ లోపంతో ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది. కొందరికి టీనేజ్‌ వయసులోనే మొదలైతే మరొకందరికి 25+, 30+ వయస్సులో ప్రారంభమవుతుంది. అయితే అకారణంగా హఠాత్తుగా జుట్టు ఊడిపోతుంటే అది సాధారణ సమస్య కాదు. మీరు జాగ్రత్త పడాల్సిందే. థైరాయిడ్‌ హార్మోన్‌ తగినంత విడుదల కాకపోయినా, ఎక్కువగా విడుదలైనా జుట్టు ఊడిపోవచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.

కేవలం జుట్టు సమస్యే కాదు, మన శరీరంలో కొన్ని మార్పులు హఠాత్తుగా, నిర్విరామంగా జరుగుతుంటే అది ప్రమాద హెచ్చరిక. ఉదాహరణకు హఠాత్తుగా గొంతు వాచినట్టయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. గొంతు ముందు భాగం ఉబ్బితే థైరాయిడ్‌ సమస్యకు సంకేతం కావొచ్చు. జ్వరంతో పాటు గొంతు వద్ద లింఫ్‌ గ్రంథులు వాచినట్టయితే మోనోన్యూక్లియోసిస్‌ ఇన్‌ఫెక్షన్‌ అయ్యిండొచ్చు. లింఫ్‌ గ్రంథులు ఉబ్బడం కొన్నిసార్లు క్యాన్సర్ల వంటి తీవ్ర జబ్బులకూ సూచిక.

మన పాదాలు కొన్నిసార్లు చల్లబడుతుంటాయి. దానికి కారణమేంటో తెలుసా? గుండె నుంచి పాదాలు దూరంగా ఉంటాయి. అందువల్ల పాదాలకు తగినంత రక్త సరఫరా జరగక చల్లగా అవుతుంటాయి. ఇది కొన్ని గుండె జబ్బులకూ సంకేతమే. రోగనిరోధకశక్తి పొరపాటున మన మీదే దాడిచేయటంతో తలెత్తే రేనాల్డ్‌ జబ్బు వల్ల చేతులు పాలిపోతుంటాయి, చల్లగా అనిపిస్తాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links