సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పట్టపగలు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక వ్యక్తిపై కత్తితో నలుగురు యువకులు దాడిచేశారు. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లకు పాల్పడ్డ యువకులను స్థానికులు పట్టుకొనే ప్రయత్నం చేయగా… ఘటనా స్థలం నుంచి అంతా పారిపోయారు. సంఘటనా స్థలంలో దుండగులు వాహనం, కత్తి వదిలివెళ్ళారు.
ఈ దాడి ఘటనలో గాయపడిన వ్యక్తిని సంతోష్ గా గుర్తించారు. అతడిపై దాడిన చేసిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి బంటీ. సంతోష్-బంటీ మధ్య గొడవలున్నాయి, కొన్ని కోర్టు కేసులు కూడా నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, బాగా తాగి, సంతోష్ పై తన అనుచరులతో కలిసి బంటీ హత్యాయత్నం చేశాడు.
ఆ దృశ్యాలు దగ్గర్లో ఉన్న సీసీటీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడిన బంటీ, పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.