justice
Home » తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు సీజేగా అలోక్‌ అరాధే ప్రమాణ స్వీకారం

by admin
0 comment

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణ హైకోర్టుకు జస్టిస్‌ అలోక్‌ అరాధే ఆరో ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై రాష్ట్ర హైకోర్టు సీజేగా వచ్చారు. కాగా,1988లో న్యాయవాదిగా చేరిన ఆయన 2009లో మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్‌ న్యాయమూర్తిగా 2016లో బదిలీ అయిన అలోక్‌ అరాధే ఆ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా పనిచేశారు. అంతేగాక 2018లో మూడు నెలల పాటు ఆ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.

అనంతరం కర్ణాటక హైకోర్టు జడ్జిగా బదిలీ అయ్యారు. 2018 నవంబరు నుంచి కొనసాగుతున్న ఆయన కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా కూడా చేశారు. కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links