Home » Top-5 Train Routes.. మరపురాని ప్రయాణం

Top-5 Train Routes.. మరపురాని ప్రయాణం

by admin
0 comment

మనం సదూర ప్రాంతాలకు వెళ్లడానికి ఎక్కువ సార్లు రైల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు ప్రయాణం కూడా మనం గమ్య స్థానానికి తొందరగా చేరుకోడానికి ఉపకరిస్తుంది. ఎన్నో సౌకర్యాలతో కూడిన రైళ్ళు మనకు అందుబాటులో ఉన్నాయి మనం రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఇరు వైపులా కనిపించే చక్కటి పంట పొలాలు, వృక్షాలు, ఇసుక క్షేత్రాలు, నదీ ప్రాంతాలు మనకు రైలు ప్రయాణంలో తీయని అనుభూతిని నింపుతాయి. రైళ్లో వెళ్లేటపుడు తోటి ప్రయాణికులతో కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.
దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినపుడు రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగానే కాక, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. విమానయానం, రోడ్డు మార్గాల్లో వెళ్లే ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ రైలు ప్రయాణంలో ఒక ఆనందం ఉంటుంది. భారతదేశంలో ఎన్నో పట్టణాలను, మూలలను కలుపుతూ రైలు మార్గాలు ఉన్నాయి.
. అయితే కొన్ని రైళ్లలో ప్రయాణిస్తున్నపుడు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. వాటిల్లోంచి ఒక ఐదు అత్యుత్తమమైన రైలు ప్రయాణాలను ఎంపిక చేసి, ఆ రైళ్లు ఏ మార్గాల్లో ప్రయాణిస్తాయి, వాటి వివరాలు ఇక్కడ తెలుపుతున్నాం. వీలైతే మీరు కూడా ఒకసారి ప్రయాణించి చూడండి.
ముంబై-గోవా తేజస్ ఎక్స్‌ప్రెస్:
13 గంటల పాటు సాగే ప్రయాణం మనకు పూర్తి ఆనందాన్ని అందిస్తుంది. ముంబై CST నుండి గోవాలోని కర్మాలి వరకు తేజస్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుంది. ఇదొక విలాసవంతమైన ప్రయాణం, ఇందులో ప్రయాణికులకు అగ్రశ్రేణి సౌకర్యాలు లభిస్తాయి. హ్యాండ్ డ్రైయర్స్, బ్రెయిలీ డిస్‌ప్లే, ట్యాప్ సెన్సార్, బయో-వాక్యూమ్ టాయిలెట్‌లు, LED టీవీ, ఫోన్ సాకెట్లు, చెఫ్ మెనూ, వై-ఫై, కాఫీ మెషిన్, సీసీ కెమెరా, స్మోక్ డిటెక్టర్, స్నాక్ టేబుల్ తదితర సౌకర్యాలను అనుభవిస్తూ చుట్టూ అందమైన దృశ్యాలను చూస్తూ ప్రయాణిస్తుంటే ఆ అనుభూతే వేరుగా ఉంటుంది.


దక్కన్ ఎక్స్‌ప్రెస్:
ముంబై- పుణె మధ్య రైలు ప్రయాణం 3-4 గంటల్లో పూర్తవుతుంది. ఈ కాస్త సమయంలోనే ప్రయాణికులు ఎన్నో మధురానుభూతులకు లోనవుతారు. ఈ రైలులో ఏసి చైర్ కార్‌- విస్టా డోమ్ సౌకర్యంతో ప్రయాణించవచ్చు. విస్టా డోమ్ కారణంగా రైలు పైన రూఫ్ భాగం కూడా అద్దాలతో ఏర్పాటు చేయబడి ఉంటుంది, దీంతో ఆహ్లాదకరమైన లోనావాలా ప్రాంతం, వెస్ట్రన్ ఘాట్స్ అందాలను ప్రయాణికులు అన్ని దిక్కుల నుంచి వీక్షించే సౌలభ్యం ఉంటుంది. రెండు ప్రధాన నగరాలను కలిపే ఈ రైలు ద్వారా వేగవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు.


నీలగిరి ప్యాసింజర్:
ఊటీ నుంచి మెట్టుపాల్యం మధ్య నడిచే నీలగిరి ప్యాసింజర్ మిగతా రైళ్లకు భిన్నంగా ఉంటుంది. ఈ రైలు ఆవిరి యంత్రంపై నడుస్తుంది. నీలగిరి పర్వతాల నుంచి ఇది ప్రయాణిస్తుంది. దట్టమైన అడవుల గుండా ఐదు గంటల పాటు సాగే ఈ ప్రయాణంలో అనేకమైన సొరంగాలు, వంతెనలతో పాటు మార్గమధ్యంలో వచ్చే మలుపులు మనల్ని ప్రత్యేక అనుభూతికి లోనుచేస్తాయి


రామేశ్వరం ఎక్స్‌ప్రెస్:
తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం వెళ్లే రైలు ఇది. ఒక వైపు సముద్రం అలల మీద ప్రయాణం, మరో వైపు చూట్టూ నీలివర్ణశోభితమైన సముద్రం- ఆకాశం కలిసే చోటుకు మనం వెళ్తున్నామా అనే అనుభూతిని ఈ రైలు ప్రయాణం మనకు కలుగజేస్తుంది.


భువనేశ్వర్-బ్రహ్మపూర్ (ప్రశాంతి ఎక్స్‌ప్రెస్):
ప్రకృతి రమణీయతను ఆస్వాదించే మధురమైన ప్రయాణం ఇంది. కేవలం 2 గంటల 40 నిమిషాలు సాగే ఈ యాత్ర మనకు దివ్యానుభూతిని ఇస్తుంది. చిలికా సరస్సు వద్ద ఉదయించే సూర్యకిరణాలతో పాటు అద్భుతమైన సరస్సులు, చుట్టూ పచ్చటి చెట్లు ఈ రైలు కిటికీల నుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links