Chiranjeevi's Bholaa Shankar Shooting Updates
Home » స్విట్జర్లాండ్ లో ‘చిరు’ హంగామా

స్విట్జర్లాండ్ లో ‘చిరు’ హంగామా

by admin
0 comment

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు.

ఈ పాటకు సంబధించిన విశేషాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా బయటపెట్టారు. స్విట్జర్లాండ్ లోని అందమైన లొకేషన్లలో తమన్నతో కలిసి ఆటపాటలో పాల్గొన్నట్టు ప్రకటించారు చిరంజీవి. ఈ పాట షూటింగ్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందని, ఈ పాట ప్రేక్షకులందరినీ మెప్పిస్తందని, ఇక తన అభిమానులను మరింత అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు చిరు.

చిరు లీక్స్ పేరిట ఎప్పటికప్పుడు తన సినిమాల అప్ డేట్స్ ను ముందుగానే బయటపెడుతున్నారు చిరంజీవి. ఆచార్య సినిమా టైటిల్ నుంచి మొన్నటి గాడ్ ఫాదర్ వరకు ప్రతిసారి చిరంజీవి ఇలా ఏదో ఒక అప్ డేట్ ఇస్తున్నారు. ఇందులో భాగంగా భోళాశంకర్ విశేషాల్ని కూడా ఆయన బయటపెట్టారు. అంతేకాదు, కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను కూడా లీక్ చేశారు.

ఇక తాజా సాంగ్ విషయానికొస్తే.. మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశాడు. మరోవైపు భోళాశంకర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్‌ కేఎస్ రామారావుతో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్, చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links