shivaji
Home » Tiger Claw- ఎట్టకేలకు భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం

Tiger Claw- ఎట్టకేలకు భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం

by admin
0 comment

ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగటివార్‌ లండన్‌లో సంతకాలు కూడా చేయనున్నారు. నవంబర్‌లో భారత్‌కు చేరే అవకాశం ఉంది. ఈ ఆయుధాన్ని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌‌ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ప్రస్తుతం లండన్‌లోని విక్టోరియా అండ్‌ ఆల్‌బర్ట్‌ మ్యూజియంలో వాఘ్‌ నఖ్‌ ఉంది. కాగా, 17వ శతాబ్దానికి చెందిన వాఘ్‌ నఖ్‌ను అఫ్జల్‌ఖాన్‌ను శివాజీ ఓడించిన రోజునే దేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సుధీర్‌ వెల్లడించారు. బీజపూర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్‌ను ఇదే వాఘ్‌ నఖ్‌తో ఛత్రపతి శివాజీ హతమార్చినట్లు చరిత్ర చెబుతోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links