2000 note
Home » 2000 Rupees – పెద్ద నోటు మర్పిడిపై సందేహాలా? పూర్తి సమాచారం ఇదిగో!

2000 Rupees – పెద్ద నోటు మర్పిడిపై సందేహాలా? పూర్తి సమాచారం ఇదిగో!

by admin
0 comment

2వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. ఇకనుంచి ఈ నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే ఇవి ప్రజల దగ్గర ఉంటే వాటిని వారు సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా.

అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి. అన్ని బ్యాంకు శాఖలతో పాటు దేశవ్యాప్తంగా ఆర్‌బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 2 వేల రూపాయల నోట్లు ఉంటే వాటిని మీ బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేసుకోవచ్చు.

దీనికి ఎలాంటి ఆంక్షలూ లేవు. కేవైసీ, ఇతర నిబంధనలను అనుసరించి వాటిని డిపాజిట్‌ చేసుకోవచ్చు. అయితే ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు మే 23, 2023 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువుని ఇచ్చారు.

రూ.2వేల నోటును సాధారణ లావాదేవీలకు ప్రజలు ఉపయోగించుకోవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, 2023 సెప్టెంబర్‌ 30లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్‌ చేయడం లేదా మార్చుకోవడం చేయాలి.

2023 మే 23 నుంచి మాత్రమే ఈ నోట్లను మార్చుకునే వీలుంటుంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యాంకులు ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ గడువు ఇవ్వడం జరిగింది. ఏ బ్యాంకులోనైనా రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకోవడానికి వీలుంటుంది.

రూ.2వేల నోటును తీసుకునేందుకు బ్యాంకు నిరాకరిస్తే, తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించాలి. ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా బ్యాంకు స్పందించకపోవడం లేదా బ్యాంకు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే రిజర్వు బ్యాంకు-ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ (RB-IOS), 2021 కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links