Prabhas next movie
Home » మరో మూవీకి గ్రీన్ సిగ్నల్

మరో మూవీకి గ్రీన్ సిగ్నల్

by admin
0 comment

ప్రభాస్ చేతిలో లెక్కలేనన్ని సినిమాలున్నాయి. రిలీజ్ కు రెడీ అయిన సినిమాలున్నాయి, సెట్స్ పై ఉన్న సినిమాలున్నాయి, త్వరలోనే సెట్స్ పైకి రావాల్సిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇన్ని సినిమాలు చేతిలో ఉన్న హీరో మరో ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూస్తాడా? ప్రభాస్ మాత్రం చూస్తున్నాడు.

ఓవైపు ఇన్ని సినిమాలు చేస్తూనే, మరోవైపు కథలు వింటున్నాడు. ఇందులో భాగంగా హను రాఘవపూడి చెప్పిన ఓ స్టోరీ ప్రభాస్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. వెంటనే సినిమా స్టార్ట్ చేద్దాం అన్నంతలా ఎగిరి గంతేశాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాను త్వరలోనే ప్రకటిస్తారు. నిర్మాతలు ఎవరనేది అప్పుడు తెలుస్తుంది.

సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు హను రాఘవపూడి. అంతకంటే ముందు అతడు ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. అయినప్పటికీ ప్రభాస్ అవేం చూడట్లేదు. కథ నచ్చి ఓకే చెప్పేశాడట.

ఇక ప్రభాస్ విషయానికొస్తే.. ఇతడు నటించిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక సలార్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మారుతి దర్శకత్వంలో ఓ సినిమా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె సినిమా తెరకెక్కుతున్నాయి.

ఇవి కాకుండా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాను స్టార్ట్ చేయాల్సి ఉంది. ఇలా బిజీబిజీగా ఉన్నాడు ప్రభాస్. ఇప్పుడేమో లిస్ట్ లోకి హను రాఘవపూడి వచ్చి చేరాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఏంటో..!

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links