Home » Operation Raavan – రక్షిత్ నుంచి స్పెషల్ పోస్టర్

Operation Raavan – రక్షిత్ నుంచి స్పెషల్ పోస్టర్

by admin
0 comment

పలాస 1978″ చిత్రంతో ప్రతిభ గల యువ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు రక్షిత్ అట్లూరి. మరో వైవిధ్యమైన కథాంశంతో ఆయన చేస్తున్న కొత్త చిత్రం ”ఆపరేషన్‌ రావణ్‌”. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సుధాస్‌ మీడియా బ్యానర్‌ మీద ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. ఈ న్యూ ఏజ్‌ యాక్షన్‌-సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు.

సోమవారం హీరో రక్షిత్ అట్లూరి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రక్షిత్ పరుగెత్తుతున్న డిజైన్ తో ఉన్న ఈ పోస్టర్ పై ‘మీ ఆలోచనలే మీ శత్రువులు’ అనే క్యాప్షన్ రాశారు. యాక్షన్, థ్రిల్లర్ ట్రెండ్ సినిమాలు బాగా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ”ఆపరేషన్‌ రావణ్‌” ఆసక్తిని కలిగిస్తోంది. తుది హంగులు దిద్దుకుంటున్న ఈ సినిమా వచ్చే నెల విడుదలకు సిద్ధమవుతోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links