Home » సింగపూర్ వేదికగా అట్టహాసంగా తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

సింగపూర్ వేదికగా అట్టహాసంగా తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

by admin
0 comment

  • పాల్గొన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, 8 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు
  • డబ్లూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తలను ప్రశంసించిన వివిధ దేశాల ప్రతినిధులు

సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ఆధ్వర్యంలో తొలి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమైనట్లు చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. మహాసభలకు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, తెలంగాణ ఐటీ సెక్రటరీ జయేశ్ రంజన్, ఒమన్ రాజ కుటుంబీకులు ఫిరాస్ బిన్ ఫాతిక్, దుబాయ్ మంత్రి అబు అబ్దుల్లా, ఫ్రాన్స్ మంత్రులు సెబాస్టియన్, జాక్ పాల్గొన్నారు, వెస్టర్న్ యూనియన్ సీఈఓ దేవిన్ మాక్ గ్రణహన్, టీఎస్ టీఎస్ చైర్మన్ జగన్ పాటిమీది, తెలంగాణ జలమండలి చైర్మన్ వి.ప్రకాశ్ తోపాటు అపీటా సీఈవో కిరణ్ రెడ్డి, తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి మంత్రి పాల్గొన్నారు.

ప్రపంచంలోని దాదాపు 80 పైగా దేశాల నుంచి తెలుగు ఐటీ ప్రతినిధులు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐటీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రపంచ ఐటీ మహాసభలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి ఐటీ మహాసభలు తరచుగా జరగాలని… రెండు తెలుగు రాష్ట్రాలు ఐటి రంగంలో మరింత వృద్ధి సాధించాలని, ఇందుకోసం కృషి చేస్తున్న WTITC చైర్మన్ సందీప్ కుమార్ మక్తలను ప్రత్యేకంగా ప్రశంసించారు.

తెలంగాణ ఐటీ శాఖ సెక్రెటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ… సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు గొప్ప ఉద్దేశంతో నిర్వహిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు ఐటీ ప్రతినిధులు ఒక చోటికి చేరి సమావేశం కావడం సంతోషకరమని అన్నారు. ఐటీ రంగంలో మరింత వృద్ధి సాధించే దిశగా ఒకరికొకరు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

WTITC చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ… వారం రోజుల పాటు ప్రపంచ తెలుగు ఐటి మహాసభలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సింగపూర్ లోని హోటల్ గ్రాండ్ కాప్త్రాన్ వేదికగా ఐటీ రంగంలో ఉన్న అపార అవకాశాలు, వాణిజ్యంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ప్రతినిధుల్లో తెలుగువారు అధిక సంఖ్యలో ఉన్నారని, ఐటీ రంగాన్ని మరింత విస్తరించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి కల్పనతో పాటు ఐటీ లో పెట్టుబడులను సైతం మరింతగా పెంచే దిశగా ఐటి మహాసభలు తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటి రంగ అభివృద్ధి కోసం కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి సందీప్ కుమార్ మక్తాల ధన్యవాదాలు తెలిపారు.

కార్యక్రమంలో WTITC ప్రతినిధులు కిషోర్ పుల్లూరి, కళ్యాణ్ చివకుల, రాన ప్రతాప్, అశ్విన్, ఇతర ఐటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links