220
వన్డే ప్రపంచకప్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్న టీమిండియాకు షాక్. భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు. చెపాక్ స్టేడియంలో ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోంది. దీనిపై కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. ”నిన్నతో పోల్చుకుంటే ప్రస్తుతం గిల్ బాగానే ఉన్నాడు. మెడికల్ టీమ్ అతడ్ని పర్యవేక్షిస్తోంది. అతడు అందుబాటులో ఉండడని ఇప్పుడే చెప్పలేం. మాకు ఇంకా 36 గంటల సమయం ఉంది” అని అన్నాడు. ఆసియాకప్‌తోపాటు ఆసీస్ వన్డే సిరీస్‌లో గిల్ రాణించాడు. అయితే గిల్ మొదటి మ్యాచ్‌కు దూరమైతే రోహిత్‌తో ఇషాన్ కిషాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు.