356
రెడ్‌వైన్ వరదలా పోటెత్తింది. పోర్చుగల్‌లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్‌వైన్‌తో నిండిపోయాయి. వైన్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్ సమీప నదిలోకి వెళ్లకుండా దారి మళ్లించడానికి అక్కడ అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రవాహం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తామని వైన్ తయారీ కంపెనీ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఈ దృశ్యం చూస్తుంటే మందుబాబులకు గుండె తరుక్కుపోతుందని, ఇది తీరని శోకమని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.