marriage
Home » Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్‌

Banjara Hills: భర్తకు మరో పెళ్లి చేసింది.. తర్వాతే అసలు ట్విస్ట్‌

by admin
0 comment

ఓ యువతి భర్తకు దగ్గరుండి మరో పెళ్లి చేసిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. అయితే పెళ్లి అయిన విషయాన్ని ఆమె దాచిపెట్టి చేసింది. ఈ విషయం తెలియడంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బంజారాహిల్స్‌లోని సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతి (20) హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో శిక్షణ తీసుకొనేందుకు వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరువర్గాల పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం చేయడంతో సహజీవనం చేశారు.

అయితే గాంధీకి రోజా అనే యువతితో సంబంధం ఉందని యువతి అనుమానించడం, ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి పోలీసులు వరకు వెళ్లారు. కానీ రోజా, గాంధీ ఇద్దరు తాము మంచి స్నేహితులమని నమ్మించడంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. మే 14న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెద్దల సమక్షంలో రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని మరి వివాహం చేయించింది.

పెళ్లైన కొన్నాళ్ల వరకు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ప్రశ్నిస్తే కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే గాంధీ, రోజా ఇద్దరు తమ పెళ్లికి కొద్ది రోజుల ముందే పెళ్లి చేసుకున్నారని బాధితురాలైన యువతి తెలుసుకొంది. అయితే మంగళవారం సదరు యువతి వద్దకు రోజా తన మద్దతుదారులతో వచ్చి న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. దీంతో యువతి మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. గాంధీ, రోజాపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links