270
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగురాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 19వ తేదీన.. నర్సాపూర్-సికింద్రాబాద్ రైలు సాయంత్రం 6 గంటలకు, సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు రాత్రి 8 గంటలకు బయల్దేరుతాయి. 20వ తేదీన.. తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రాత్రి 7.50 గంటలకు, సికింద్రాబాద్-కాకినాడ రైలు రాత్రి 9 గంటలకు బయల్దేరుతాయి.27421వ తేదీన.. కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రాత్రి 8.10 గంటలకు బయల్దేరుతుంది. అలాగే 23న.. సికింద్రాబాద్-కాకినాడ ప్రత్యేక రైలు రాత్రి 7 గంటలకు, 24వ తేదీన.. కాకినాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది.