india
Home » AsiaCup2023- ‘ఆసియా’ మనదే.. ఇక ‘దునియా’నే బ్యాలెన్స్‌

AsiaCup2023- ‘ఆసియా’ మనదే.. ఇక ‘దునియా’నే బ్యాలెన్స్‌

by admin
0 comment

భారత్‌దే ఆసియాకప్‌. ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి ఎనిమిదోసారి టీమిండియా ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక.. పేసర్ సిరాజ్‌ (6/21) దెబ్బకు కుదేలైంది. 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. అతడు నిప్పులు చెరిగే బంతులకు లంక బ్యాటర్ల దగ్గర జవాబే లేదు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ వికెట్ నష్టపోకుండా 6.1 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్‌ కిషాన్‌ (27*), శుభ్‌మన్‌ గిల్‌ (23*) ఆది నుంచే దూకుడగా ఆడారు. లంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బౌండరీలు బాదుతూ లాంఛనాన్ని పూర్తిచేశారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లదే హవా. కుశాల్‌ పెరారేను ఔట్‌ చేసి బుమ్రా వికెట్ల వేట ప్రారంభించగా తర్వాత సిరాజ్‌చెలరేగాడు. తాను వేసిన తొలి ఓవర్‌ను మెయిడిన్ చేసిన సిరాజ్‌ అనంతరం లంక బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నాలుగో ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 12 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయింది. తర్వాత హార్దిక్‌ కూడా తోడవ్వడంతో శ్రీలంక 50 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టులో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఏకంగా అయిదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. వన్డేల్లో లంక జట్టుకు ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇక వన్డే ఫైనల్లో తక్కువ స్కోరు సాధించిన జట్టుగా శ్రీలంక చెత్త రికార్డు నమోదుచేసుకుంది.

వార్‌ వన్‌సైడ్‌
గ్రూప్‌-4 స్టేజ్‌లో శ్రీలంకతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగడంతో ఫైనల్‌లో కూడా అదే తరహాలో పోరు సాగుతుందని భావించారంతా. కానీ సిరాజ్‌ సంచలన ప్రదర్శనతో మ్యాచ్‌ వన్‌సైడ్‌గా మారింది. కనీస పోటీ లేకుండా ఫైనల్ సాగింది. అయితే అంచనాలకు తగ్గట్లుగానే ఆసియాకప్‌ టైటిల్‌ సాధించిన టీమిండియా ఇక ప్రపంచకప్‌పై గురిపెట్టనుంది. ఇక లంకపై సాధించిన ఈ విజయం రికార్డు సృష్టించింది. వన్డే ఫైనల్లో, భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక బంతుల మిగిలుండగా సాధించిన గెలుపుగా ఇది నిలిచింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links