russia
Home » Russia’s Luna-25 వైఫల్యానికి యుద్ధమే కారణమా?

Russia’s Luna-25 వైఫల్యానికి యుద్ధమే కారణమా?

by admin
0 comment

చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి భారతదేశమంతా విజయానందంలో ఉంది. మరోవైపు చంద్రయాన్‌-3 కంటే ముందే సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించాలనుకున్న రష్యా వైఫల్యంతో బాధలో మునిగింది. దాదాపు 5 దశాబ్దాల తర్వాత జాబిల్లిపై ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ ఇటీవల విఫలమైన సంగతి తెలిసిందే. అయితే లూనా -25 వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

వైఫల్యానికి ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం పరోక్ష కారణమని నిపుణులు భావిస్తున్నారు. లూనా-25 భద్రంగా దిగడానికి అవసరమైన కెమెరాను తొలుత ఈఎస్‌ఏ (ఐరోపా అంతరిక్ష సంస్థ)తో రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఉక్రెయిన్‌పై దాడికి దిగడంతో తన కెమెరాను తొలగించాలని ఈఎస్‌ఏ డిమాండ్‌ చేసింది. అంతేగాక నావిగేషన్‌ సిస్టమ్‌ను ఎయిర్‌బేస్‌ నుంచి కొనాలని ప్రయత్నించిన రష్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధ ఆంక్షల వల్ల కొనుగోలు చేయలేకపోయింది. దీంతో స్వదేశీ పరికరాలు ఉపయోగించడంతో వ్యోమనౌక బరువు పెరిగి సున్నితమైన శోధన పరికరాలను అమర్చడానికి ప్లేస్‌ కరవైంది. మరోవైపు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్ట్‌ అయిన ఎన్పీవో లావోచ్కిన్‌ కంపెనీ అధికారులే లూనా-25 రూపొందించారు.

అయితే జాబిల్లిపై ఎన్నో ఏళ్ల తర్వాత ప్రయోగించడమే వైఫల్యానికి కారణమని రోస్‌కాస్మోస్‌ డైరక్టర్‌ జనరల్‌ బోరిసోవ్‌ అన్నారు. అనుభవ నైపుణ్యాలను పోగొట్టుకున్నామని, చివరిసారిగా 1976లో చంద్రమండల యాత్ర చేపట్టామని గుర్తుచేశారు. 1960, 70ల్లో తమ సీనియర్లు గడించిన అనుభవాన్ని తాము పోగొట్టుకున్నామని తెలిపారు. లూనా-25 థ్రస్టర్లను 84 సెకన్లు సేపు పనిచేయించాల్సి ఉండగా, 127 సెకన్ల సేపు పనిచేయడంతో ఇంజన్లు సరిగా మూసుకోలేదని పేర్కొన్నారు. తర్వాత అత్యవసర పరిస్థితి తలెత్తిందని, అనియంత్ర కక్ష్యలోకి వెళ్లి ‘లూనా-25’ కుప్పకూలిపోయిందని తెలిపారు. కాగా, ప్రస్తుతం 2027లో చేపట్టబోయే చంద్ర మండల యాత్రపైన రష్యా దృష్టి సారించింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links