447
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 191 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసిన భారత్ అరుదైన రికార్డు సాధించింది. బుమ్రా,సిరాజ్, హార్దిక్, కుల్దీప్, జడేజాలు తలో రెండు వికెట్లతో పాక్‌ను బెంబేలెత్తించారు. అయితే ప్రత్యర్థి జట్టును ఇలా ప్రతి బౌలర్ రెండు వికెట్లు తీసి ఆలౌట్ చేయడం ప్రపంచకప్‌లో ఇది మూడోసారి. ఈ అరుదైన రికార్డును తొలిసారిగా 2011లో పాకిస్థాన్‌పైనే భారత్ సాధించింది. ఆ తర్వాత 2015లో శ్రీలంక-న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు కాగా.. మరోసారి టీమిండియానే ఈ ఘనత సాధించింది. అయితే ఈ సెంటిమెంట్‌తో.. 2011లో ధోనీసేన ఛాంపియన్‌గా నిలిచినట్లే ఈ సారి కూడా భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.