sara
Home » గిల్‌తో డీప్‌ఫేక్‌ ఫొటోలు- సారా టెండుల్కర్‌ రియాక్షన్‌

గిల్‌తో డీప్‌ఫేక్‌ ఫొటోలు- సారా టెండుల్కర్‌ రియాక్షన్‌

by admin
0 comment

సెలబ్రిటీలతో సహా అందరినీ ప్రస్తుతం వేదిస్తోంది ‘డీప్‌ఫేక్‌’ టెక్నాలజీ. రష్మిక డీప్‌ఫేక్‌ వీడియోతో ఈ టెక్నాలజీతో ఉన్న సమస్య అందరికీ చేరింది. అయితే తాజాగా డీప్‌ ఫేక్‌ గురించి సచిన్‌ టెండుల్కర్‌ గారాలపట్టి సారా టెండుల్కర్‌ స్పందించింది. ”మన హ్యాపీ-సాడ్‌ మూమెంట్స్‌తో పాటు డైలీ యాక్టివిటీస్‌ సోషల్‌మీడియాలో పంచుకుంటుంటాం.కానీ టెక్నాలజీని కొందరు మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. నా ఫొటోలను డీప్‌ఫేక్‌తో మారుస్తున్నారు. కొందరు కావాలనే ఇలా చేస్తూ ట్విటర్‌లో తప్పుదోవ పట్టుస్తున్నారు. అసలు నాకు ట్విటర్‌ అకౌంటే లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నిజాన్ని దాచొద్దు” అని సారా ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టింది. డీప్‌ఫేక్‌తో.. యంగ్ క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో సారా కలిసి ఉన్నట్లు ఫొటోలు ఎడిట్‌ చేసి కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై సారా ఇండైరెక్ట్‌గా ఇలా రియాక్ట్ అయ్యింది. సారా-గిల్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links