samantha
Home » -150 డిగ్రీల చలిలో సమంత ట్రీట్మెంట్​

-150 డిగ్రీల చలిలో సమంత ట్రీట్మెంట్​

by admin
0 comment

హీరోయిన్ సమంత చాలా కాలం నుంచి మయోసైటిస్‌ అనే ఆటో ఇమ్యూనీ వ్యాధితో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. చాలా సార్లు దీని గురించి చెప్పుకొని ఆమె బాధ పడింది. అయితే తాజాగా తన ట్రీట్మెంట్​కు సంబంధించి ఓ చిన్న అప్డేట్​ను సోషల్ మీడియాలో పంచుకుంది. కైరో థెరపీ సెషన్‌కు హాజరైనట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా షేర్‌ చేసింది. అందులో ఆమె -150 డిగ్రీల ఫారెన్​ హీట్​లో పొగలు కక్కే చలిలో ఓ టబ్​లో కూర్చొని కనిపించింది. శరీరంలో బలహీనపడిన ఇమ్యూనిటీ సిస్టమ్‌ మెరుగ్గా పని చేయించడంతో పాటు, ఇన్‌ఫెక్షన్‌ బారినపడకుండా ఉండేలా ఈ థెరపీ సహాయ పడుతుందని చెప్పింది. దీన్ని వల్ల వైట్ బ్లడ్ సెల్స్​ఉత్పత్తి పెరుగుతుందని, రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందని వివరించింది. అలాగే మెంటల్ హెల్త్, ఎనర్జీని కూడా ఇస్తుందని చెప్పింది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links