ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా శ్రుతిహాసన్ నటించగా, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబరు 22న విడుదల తేదీని ఖరారు చేసింది ‘సలార్’ టీమ్. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రమోషన్ ప్రోగ్రామ్స్ మాత్రం ఊపందుకోలేదు. దీంతో మరోసారి ఈ సినిమా విడుదలపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటికి తెర దించుతూ ట్రైలర్ విడుదలకి సిద్ధమైంది చిత్రబృందం. డిసెంబరు 1న ట్రైలర్ విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకొంటోంది. మరోవైపు ప్రభాస్ ఇటీవల హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ప్రభాస్ దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. త్వరలోనే ‘సలార్’ ప్రమోషన్స్‌లో ప్రభాస్ కనిపించనున్నాడు.
253
previous post