jailer
Home » Rajinikanth’s Jailer: వసూళ్ల వర్షం కురిపిస్తోన్న జైలర్‌

Rajinikanth’s Jailer: వసూళ్ల వర్షం కురిపిస్తోన్న జైలర్‌

by admin
0 comment

ప్రతి వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నిలబడేది మాత్రం అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. గతవారం కూడా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా జైలర్ సినిమానే మరోసారి నిలబడింది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

గత శుక్రవారం ప్రేమ్ కుమార్ సినిమా రిలీజైంది. సంతోష్ శోభన్ హీరోగా నటించిన సినిమా ఇది. భారీ ప్రచారంతో వచ్చిన ఈ సినిమా తుస్సుమనిపించింది. కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనే నానుడిని నిజం చేసింది ప్రేమ్ కుమార్ సినిమా. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఎక్కడా కామెడీ ఛాయలు కనిపించకపోవడం విశేషం.

ప్రేమ్ కుమార్ తో పాటు వచ్చిన మరో సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. సోహైల్ హీరోగా నటించిన ఈ సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కొంతమంది యావరేజ్ అన్నారు. మరికొంతమంది కొత్త కంటెంట్ ను ఎంకరేజ్ చేయమన్నారు. కానీ 3 రోజులు గడిచేసరికి, మిస్టర్ ప్రెగ్నెంట్ తేలిపోయింది. ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం కష్టమని తేల్చేసింది ట్రేడ్.

ఈ రెండు సినిమాలతో పాటు పిజ్జా-3 అనే హారర్ మూవీ కూడా వచ్చింది. సూపర్ హిట్ సినిమా టైటిల్ ను రిపీట్ చేశారు తప్ప, ఆ హిట్ సినిమాలో ఉన్న కథ-కథనాన్ని పిజ్జా-3లో రిపీట్ చేయలేకపోయారు. దీంతో ఈ మూవీ రిలీజైన మొదటి రోజుకే దుకాణం సర్దేసింది. ప్రస్తుతం మార్కెట్లో హారర్ సినిమాల ట్రెడ్ నడుస్తున్నప్పటికీ, పిజ్జా-3 ఆకట్టుకోలేకపోయిందంటే, ఈ సినిమా ఫలితాన్ని ఈజీగానే అర్థం చేసుకోవచ్చు.

ఇలా చెప్పుకోదగ్గ 3 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో, రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాకు మరోసారి ఆక్సిజన్ అందినట్టయింది. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా మరిన్ని వసూళ్లు రాబట్టింది. అటు చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా దాదాపు క్లోజింగ్ కు వచ్చేసింది. నామమాత్రపు థియేటర్లలో మాత్రమే కొనసాగుతోంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links