ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్… ఓటమిపై కాకుండా ప్రపంచకప్ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ ఈవెంట్‌గా ఉందని పాక్ టీమ్ డైరక్టర్ మికీ అర్థర్ అన్నాడు. దీనిపై ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఐసీసీ నిర్వహించే ప్రతి ఈవెంట్‌లో ఏదో ఒక దశలో ఇలాంటి విమర్శలు వస్తుంటాయని, వాటికి దూరంగా ఉంటామని అన్నాడు. అయితే మరింత మెరుగ్గా టోర్నీ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఇప్పుడే ఈ ప్రపంచకప్ ప్రారంభమైందని, ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయని, ఇంకేం మార్పులు చేయాలి? మరింత నాణ్యంగా ఎలా నిర్వహించాలనేదానిపై కసరత్తులు చేస్తామన్నాడు. అందరి వద్దకు క్రికెట్‌ను చేరవేసేందుకు ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటామని, కచ్చితంగా ఈ వరల్డ్‌కప్ అత్యుత్తమంగా నిలుస్తుందని అన్నాడు.
313