కోలీవుడ్ స్టార్‌హీరో విజయ్ నటించిన లియో సినిమా థియేటర్లలో సూపర్ హిట్టైంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం థియేట్రికల్ వెర్షన్ కు కాస్త భిన్నంగా ఓటీటీ వెర్షన్ ఉండడమే. సినిమాతో సంబంధం లేకుండా, ఓటీటీ వెర్షన్ లో 18 నిమిషాల పాటు కొత్త సన్నివేశాలు ఉండబోతున్నాయనే విషయాన్ని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఓటీటీ వెర్షన్ కోసం ఫ్యాన్ష్ విపరీతండా వెయిట్ చేస్తున్నారు. అయితే చెప్పిన టైమ్ కంటే కాస్త ముందుగానే లియో సినిమా ఓటీటీలోకి రానుంది. లెక్కప్రకారం, ఈ సినిమా నవంబర్ 21న స్ట్రీమింగ్‌కు రావాలి. కానీ 16వ తేదీకే ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇది తమిళనాట వంద కోట్ల రూపాయల షేర్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఇలా సినిమాపై చర్చ సాగుతుండగానే ఓటీటీలోకి తీసుకురావాలనేది నెట్ ఫ్లిక్స్ ప్లాన్.
220
previous post