301
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాణిక్యరావు టాక్రే, కేసి వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు.