మెగాటోర్నీలో ఆద్యంతం సత్తాచాటిన టీమిండియా ఆఖరి మెట్టుపై తడబడి వరల్డ్ కప్‌ను చేజార్చుకుంది. ఆస్ట్రేలియా చేతిలో ఫైనల్ ఓడిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోని పరిస్థితి గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరించాడు. ”డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లంతా భావోద్వేగానికి గురయ్యారు. కోచ్‌గా వాళ్లని ఆ స్థితిలో చూడలేకపోయా. టీమ్ అంతా ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. మేం ఎంతో శ్రమించాం. కానీ ఫైనల్‌లో మా కంటే ఆస్ట్రేలియా బాగా ఆడింది” అని ద్రవిడ్ అన్నాడు. మరోవైపు కోచ్‌గా బీసీసీఐతో చేసుకున్న ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగిసింది. దీనిపై ద్రవిడ్ స్పందిస్తూ.. ”కోచ్‌గా కంటిన్యూ అవ్వాలనే ఆలోచన ఇప్పటివరకు చేయలేదు. అంత తీరిక కూడా లేదు. ప్రపంచకప్‌పైనే ఫోకస్ పెట్టా. భవిష్యత్ గురించి ఆలోచించలేదు” అని ద్రవిడ్ చెప్పాడు. కోచ్‌గా తన రెండేళ్ల కాలంలో ద్రవిడ్.. ఐసీసీ టోర్నమెంట్స్‌లో టీమిండియాను రెండుసార్లు ఫైనల్స్‌కు, ఒకసారి సెమీస్‌కు తీసుకెళ్లాడు.
221
previous post