virat
Home » AsiaCup2023: పాక్‌పై కోహ్లికి ఎందుకంత కసి?

AsiaCup2023: పాక్‌పై కోహ్లికి ఎందుకంత కసి?

by admin
0 comment

ఆసియాకప్‌(AsiaCup2023)లో పాకిస్థాన్‌తో (INDvPAK) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 228 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో పరుగుల పరంగా పాకిస్థాన్‌పై భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి (Virat Kohli) తన కెరీర్‌లో 77వ సెంచరీ బాదాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌ అంటే కోహ్లికి ఎనర్జీ రెట్టింపు అవుతుంటుంది. అసాధ్యమైన ఘనతలను ఈజీగా సాధిస్తాడు. తన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు 183 పాక్‌ జట్టుపైనే నమోదుచేశాడు. ఇక గత టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై కోహ్లి చేసిన ఛేజింగ్‌.. క్రికెట్‌ చరిత్రలోనే ప్రత్యేకం.

ఇప్పటివరకు పాక్‌పై 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌ 55.16 సగటుతో 662 పరుగులు చేశాడు. ఇక టీ20ల్లో అయితే ఏకంగా అతడి బ్యాటింగ్‌ ఏవరేజ్‌ 81పైగా ఉంది. 10 మ్యాచ్‌ల్లో 488 పరుగులు బాదాడు. ఆసియాకప్‌లో కూడా కోహ్లి పేరిట ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. ఆసియాకప్‌ 14 వన్డేల్లో 67.18 సగటుతో పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు ఉన్నాయి.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ పలు రికార్డులు బద్దలుకొట్టాడు. వన్డేల్లో 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనతను వేగంగా సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. దీని కోసం కోహ్లి 277 ఇన్నింగ్స్‌లు ఆడగా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ 321 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు. ఇక మ్యాచ్‌ వేదిక అయిన కొలంబోలో కోహ్లి వరుసగా నాలుగు శతకాలు సాధించడం విశేషం.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links