ఫోన్లో వాట్సాప్‌కు లాక్ యూజ్ చేస్తుంటాం. పర్సనల్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతుంటాం. కానీ ఆఫీసుల్లో వెబ్‌లో వాట్సాప్ యూజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు వెబ్‌లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత లాగ్అవుట్ చేయడం మర్చిపోతుంటాం. విరామం తీసుకునే సమయంలోనూ దాన్ని అలాగే వదిలి వెళ్తుంటాం. ఆ టైంలో మన చాట్‌ను ఎవరైనా చూసే ఛాన్స్ ఉంటుంది. కానీ లాక్ స్క్రీన్ ఫీచర్‌ను ఉపయోగిస్తే మన పర్మిషన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఎవరూ చూడలేరు. అది ఎలా అంటే మొదట వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత పైన మూడు చుక్కల గుర్తు మీద క్లిక్ చేయాలి. సెటింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీని ఎంచుకోవాలి. అక్కడ లాక్ స్క్రీన్ ఆప్షన్ ఎంచుకోని.. పాస్‌వర్డ్‌ను పెట్టుకోని కన్ఫార్మ్ చేసుకోవాలి. అక్కడ ఆటోమేటిక్ స్క్రీన్ లాక్ టైమింగ్‌నూ ఎంచుకోవచ్చు. నిర్ణయించిన సమయం తర్వాత దానంతటదే స్క్రీన్ లాక్ అయిపోతుంది.
1.8K
previous post