heroines and their remunerations
Home » Heroines: హీరోయిన్లు – రెమ్యూనరేషన్లు

Heroines: హీరోయిన్లు – రెమ్యూనరేషన్లు

by admin
0 comment

హీరోయిన్లు (Heroines) అందంగా కనిపిస్తారు.. తెరపై నటిస్తారు.. రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఇది తప్ప వాళ్లకు ఇంకేం రాదనుకుంటే పొరపాటు. చాలామంది హీరోయిన్లు వ్యాపారాలు కూడా చేస్తారు. బ్యూటీ విద్ బ్రెయిన్ అనిపించుకుంటున్న అలాంటి హీరోయిన్లు ఎవరో చూద్దాం.

సమంత చాన్నాళ్ల కిందటే సొంతంగా ఓ డిజైనరీ బ్రాండ్ లాంఛ్ చేసింది. దీని పేరు సాకి. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సాకి అభివృద్ధి కోసం కష్టపడుతోంది. దీంతో పాటు కొన్ని స్టార్టప్స్ లో ఆమె పెట్టుబడులు పెట్టినట్టు టాక్.

మిల్కీబ్యూటీ తమన్న తండ్రి వజ్రాల వ్యాపారి. ఆ వారసత్వాన్ని తమన్న కూడా కొనసాగిస్తోంది. తన పేరిట ఓ డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్ ను ప్రవేశపెట్టింది. ఆ బ్రాండ్ కు తనే క్రియేటివ్ హెడ్ గా కూడా వ్యవహరిస్తోంది. అంటే అందులో డిజైన్స్ అన్నీ తమన్నానే ఓకే చేస్తుందన్నమాట.

ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యథిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్ రష్మిక. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చకచకా సినిమాలు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన డబ్బు మొత్తాన్ని తన తండ్రి బిజినెస్ లో పెడుతుంది. ఆ మధ్య రష్మిక ఆస్తులు, ఆఫీసులపై ఐటీ దాడులు జరిగాయి. ఆ సందర్భంగా రష్మిక, ఆమె తండ్రి చేస్తున్న వ్యాపారాల గురించి తెలుగు జనాలకు తెలిసింది.

ఇన్నాళ్లూ సంపాదించడంతోనే సరిపోయింది. పెట్టుబడులు, వ్యాపారాల గురించి పెద్దగా ఆలోచించలేదు కాజల్. ఎప్పుడైతే పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైందో, ఆ వెంటనే తన మైండ్ లో ఉన్న బిజినెస్ ప్లాన్స్ అన్నింటినీ బయటకు తీసింది. భర్తతో కలిసి హోమ్ ఇంటీరియర్ కు సంబంధించి ఓ ఈ-కామర్స్ పోర్టల్ పెట్టింది. భర్తకు సంబంధించిన కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఆమె మదిలో సినిమా ప్రొడక్షన్ ఆలోచన కూడా ఉంది. ఆల్రెడీ బ్యానర్ రిజిస్టర్ చేయించింది.

హీరోయిన్ నమిత తన పేరిట ఓటీటీ యాప్ తీసుకొచ్చింది. దీని పేరు నమిత థియేటర్. ఈ ఓటీటీకి నమిత బ్రాండ్ పార్టనర్ కాగా.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవివర్మ మేనేజింగ్ డైరక్టర్. నిజజీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కిన షార్ట్ ఫిలిమ్స్, సినిమాలకు ”నమిత థియేటర్” లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంట. తన ఓటీటీ ద్వారా చిన్న నిర్మాతలు, కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తానంటోంది నమిత.

తనకు ఇష్టమైన వ్యాపకాన్నే వ్యాపారంగా మార్చుకుంది రకుల్ ప్రీత్ సింగ్. చాన్నాళ్ల కిందటే జిమ్ బిజినెస్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్, విశాఖలో రకుల్ కు లగ్జరీ జిమ్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా తన బ్రాండ్ పేరిట జిమ్స్ ఏర్పాటుచేయాలనేది రకుల్ కోరిక. ఎక్కువగా డబ్బులు దీనిపైనే ఖర్చు పెడుతోంది. త్వరలోనే బాయ్ ఫ్రెండ్ జాకీతో కలిసి నిర్మాతగా మారుతుందేమో చూడాలి.

చార్మి చేస్తోన్న వ్యాపారం సంగతి అందరికీ తెలిసిందే. దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి సినిమా నిర్మాణ రంగంలో కొనసాగుతోంది చార్మి. పూరి సినిమాలకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు అన్నింటినీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఈమె మైండ్ లో ఓటీటీ ప్రొడక్షన్ ఆలోచనలు కూడా ఉన్నాయి.

న్యూయార్క్ లో సోనా పేరిట ఇండియన్ రెస్టారెంట్ ను ఓపెన్ చేసింది ప్రియాంక చోప్రా. దీంతో పాటు ఆమెకు ఓ డేటింగ్ యాప్ ఉంది. మరోవైపు హోల్ బెర్టాన్ స్కూల్ అనే కోడింగ్ ఎడ్యుకేషన్ స్టార్టప్ లో పెట్టుబడులు పెట్టింది. పర్పుల్ పెబల్ పిక్చర్స్ అనే బ్యానర్ కూడా ఉంది. వీటితో పాటు దుబాయ్, అమెరికాలో రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతుంది. లాస్ ఏంజెల్స్ లో ఈమెకు 20 మిలియన్ డాలర్ల ఖరీదైన భవనం ఉంది.

శిల్పాషెట్టి… దాదాపు 8 ఏళ్ల కిందటే వ్యాపారం స్టార్ట్ చేసింది. గ్రూప్ కో డెవలపర్స్ అనే సంస్థలో పెట్టుబడులు పెట్టింది. ఇదొక రియల్ ఎస్టేట్ సంస్థ. ప్రస్తుతం ఆర్గానిక్ ఫార్మింగ్ లో పెట్టుబడులు పెడుతోంది.

ఐశ్వర్యరాయ్ కు ఆంబీ అనే స్టార్టప్ కంపెనీలో పెట్టుబడులున్నాయి. బెంగళూరు కేంద్రంగా ఇది పనిచేస్తుంది. దీంతో పాటు బెంగళూరులోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈమెకు వాటాలున్నాయి.

ఎపిగమియా అనే బ్రాండ్ లో పెట్టుబడులు పెట్టింది దీపిక పదుకోన్. ఇదొక హెల్త్ ఫుడ్ కంపెనీ. త్వరలోనే దీన్ని మరింత విస్తరించబోతోంది. ప్రస్తుతం తన బిజినెస్ ఆలోచనలన్నీ దీని చుట్టూనే తిరుగుతున్నాయి. ఈమెకు తోడుగా భర్త రణ్వీర్ సింగ్ కూడా చేరాడు.

విరాట్ కోహ్లిని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలు తగ్గించిన అనుష్క శర్మ.. తనకంటూ ఓ సొంత బ్యానర్ పెట్టుకుంది. మూవీ, ఓటీటీ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఓటీటీలో సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థల్లో అనుష్క శర్మకు చెందిన క్లీన్ స్లేట్ ఫిలిమ్స్ కూడా ఒకటి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links