exams
Home » TSPSC: గ్రూప్‌-2 వాయిదా

TSPSC: గ్రూప్‌-2 వాయిదా

by admin
0 comment

పోటీ పరీక్ష అభ్యర్థుల అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి నవంబర్‌లో పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్‌-2తో పాటు వరుసగా ఇతర పోటీ పరీక్షలు కూడా ఉండటంతో వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. వారికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శితో సమావేశమయ్యారు. అన్ని అంశాలపై సమగ్రంగా చర్చించి, పరిస్థితులను సీఎంకు నివేదించారు. ఆయన ఆదేశాల మేరకు పరీక్షలను నవంబరుకు వాయిదా వేసినట్లు సీఎస్‌ శనివారం రాత్రి ప్రకటించారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్‌ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.

తెలంగాణలోని లక్షల మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్‌పీఎస్సీతో సంప్రదించి గ్రూప్‌-2 పరీక్షను రీషెడ్యూల్‌ చేయాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారని ట్వీట్‌ చేశారు. భవిష్యత్తులో నియామక పరీక్షల నోటిఫికేషన్‌లు సరిగ్గా ఉండేలా చూడాలని సీఎం సూచించారని, దీని ద్వారా అభ్యర్థికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29,30న జరగాల్సిన గ్రూప్‌-2కు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సన్నాహాలు కూడా జరిగాయి.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links