Chandrayaan-3
Home » Chandrayaan-3: విజయం దిశగా విక్రమ్‌.. ఇబ్బందుల్లో రష్యా ‘లూనా-25’

Chandrayaan-3: విజయం దిశగా విక్రమ్‌.. ఇబ్బందుల్లో రష్యా ‘లూనా-25’

by admin
0 comment

భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం దిశగా దూసుకెళ్తోంది. శనివారం అర్ధరాత్రి దాటాక మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. రెండో, చివరి డీ బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో జాబిల్లికి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్‌ మాడ్యుల్‌ చేరింది. ”విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 కి.మీX 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం.చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది” అని ఇస్రో ట్విటర్‌లో పేర్కొంది. కాగా, చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడానికి చంద్రయాన్‌-3ను జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

మరోవైపు చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపడానికి ప్రయత్నిస్తున్న రష్యా.. ‘లూనా-25’ ల్యాండర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. ఆటోమేటిక్‌ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్యోస్‌ తెలిపింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని వెల్లడించింది. ప్రస్తుతం రష్యా వ్యోమనౌక జాబిల్లి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. లూనా-25ని ఈ నెల 11న రష్యా ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే చంద్రయాన్‌-3 దిగే ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలోనే 1-2 రోజుల ముందు లూనా-25 దిగాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links