cbn
Home » chandrababu: సుప్రీంకోర్టులో విచారణ వారం వాయిదా

chandrababu: సుప్రీంకోర్టులో విచారణ వారం వాయిదా

by admin
0 comment

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశారు. క్వాష్‌ పిటిషన్‌ను గత శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తిరస్కరించగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే తొలుత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టి విముఖత వ్యక్తం చేశారు. లాయర్లు విచారించాలని కోరడంతో దీంతో న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ మెన్షన్‌ చేశారు. తక్షణమే లిస్టింగ్‌ చేయాలని కోరారు. బెయిల్‌ కోరుకోవడం లేదని, పోలీసుల కస్టడీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మరోవైపు బెయిలు కోసం చంద్రబాబు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అక్టోబరు 4వ తేదీకి వాయిదా పడింది. ఇదే కేసులో చంద్రబాబును మరో అయిదు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ దాఖలుచేసిన పిటిషన్‌పై కూడా అదే రోజు విచారణ చేపట్టనుంది.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links