ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను సెంచురీ మ్యాట్రెస్ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి కాపర్ జెల్ టెక్నాలజీకి మారింది. అయితే ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ సంస్థ మీడియాతో మంగళవారం వెల్లడించింది.
సెంచురీ మ్యాట్రెస్‌తో ఒప్పందం సందర్భంగా పీవీ సింధు మాట్లాడారు. విజయానికి శిక్షణ ఎలా అవసరమో, సరైన మ్యాట్రెస్ కూడా మంచి నిద్రకు అవసరమని ఆమె అన్నారు. సెంచురీ ప్రయాణంలో ఉత్సాహంగా పాల్గొంటానని తెలిపారు. మరోవైపు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్ మలానీ మాట్లాడుతూ.. సెంచురీ ఫ్యామిలీలోకి పీవీ సింధును స్వాగతిస్తున్నామని అన్నారు. స్పోర్ట్స్ స్పెషలిస్ట్ అయిన సింధు, స్లీప్ స్పెషలిస్ట్ అయిన సెంచురీ భాగస్వామ్యమవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆమె రాకతో ప్రజల్లోకి మరింత చేరువవుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సెంచురీ మ్యాట్రెస్ 18 రాష్ట్రాల్లో 4500కు పైగా డీలర్‌లు, 450కు పైగా ప్రత్యేక బ్రాండ్ స్టోర్‌లను కలిగి ఉంది. హైదరాబాద్, భువనేశ్వర్‌లో ఆ సంస్థ తయారీ ప్లాంట్‌లు ఉన్నాయి.