283
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త మూవీపై ఓ అప్‌డేట్ వచ్చింది. ఆ మూవీ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనిల్ కుమార్ అనే ఓ కొత్త డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. అనిల్‌కుమార్ ‘సాహో’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అయితే ఈ కొత్త సినిమాకి ‘ధీర’ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది. యువీ క్రియేషన్స్ సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ఫాంటసీ కథతో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక అఖిల్ రీసెంట్‌గా నటించిన ‘ఏజెంట్’ పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.