255
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై సచిన్ టెండుల్కర్ మాట్లాడాడు. ” విరాట్‌కు బిగ్ బిగ్ కంగ్రాట్స్. వన్డేల్లో 50 సెంచరీలు చేయడం ఈజీ అనేలా సాధించాడు. ఇంక్రెడిబల్, సూపర్, అతడిని చూస్తే గర్వంగా ఉంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ‘కోహ్లి ఫస్ట్ డే’ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇతర ఆటగాళ్లు అతడితో ప్రాంక్ చేశారు. నా పాదాలు తీసుకొని ఆశీర్వాదం పొందితే మంచి కెరీర్ వస్తుందని ఆటపట్టించారు. ఆ టైమ్‌లో నవ్వుతూ దూరంగా ఉన్నా. కానీ ఈ రోజు అదే ప్లేయర్ చరిత్ర సృష్టించాడు. దేశం తరఫున ఎన్నో ఘనతలు అందుకున్నాడు. ఐమ్ సో ప్రౌడ్” అని సచిన్ కోహ్లిని ప్రశంసించాడు.