వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ రేసు ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా మాత్రమే అధికారికంగా అర్హత సాధించగా, దక్షిణాఫ్రికా దాదాపు ఖరారైంది. అయితే మిగిలిన రెండు సెమీస్ బెర్త్‌ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే న్యూజిలాండ్-పాకిస్థాన్, ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఎంతో ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ గెలిస్తే.. పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ఒకేసారి టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి. ఎందుకంటే ఆ నాలుగు జట్లు అయిదో విజయం సాధించలేవు.
కాగా, ఆటగాళ్ల గాయాల బెడద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను వేదిస్తోంది. గాయంతో మ్యాక్స్‌వెల్, వ్యక్తిగత కారణాలతో మిచెల్ మార్ష్ దూరం కావడం ఆసీస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసిన కీవీస్ జట్టులో కేన్ విలియమ్సన్, పేసర్ హెన్రీ గాయపడ్డారు.