త్వరలో విశాఖ నుంచే పాలన సాగించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. డిసెంబరులోపు విశాఖకు మారనున్నట్లు తెలిపారు. పరిపాలన ఇక్కడి నుంచే కొనసాగిస్తానని చెప్పారు. రిషికొండలోని ఐటీ హిల్స్ లో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడారు. 4,160 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని, ఆ సంస్థకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. హైదరాబాద్, బెంగుళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్ గా మారబోతుందని అన్నారు. ఇప్పటికే వైజాగ్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారిందని, ఏటా 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు. ఇక ఏపీలోనే విశాఖ అతి పెద్ద నగరమని, అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీరం ఈ నగరానికి సొంతమన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు వస్తున్నాయని, వాళ్లకి ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఒక్క ఫోన్‌కాల్‌తో కల్పిస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
278
previous post