301
పంజాబ్‌లోని ఫాజిల్కా జిల్లాలో ఇద్దరు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. పార్టనర్‌షిప్‌లో రూ.100కు లాటరీ టికెట్ కొని, రూ.కోటిన్నర బంపర్ ప్రైజ్‌మనీని గెలుచుకున్నారు. అబోహర్ టౌన్‌కు చెందిన రమేశ్, కుకీ గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. చాలా సార్లు చిన్న చిన్న బహుమతులు గెలుచుకున్నారు. అయితే ఇటీవల రెండు రూ.100 టికెట్లు కొనుగోలు చేశారు. ఆదివారం రాత్రి లాటరీ ఫలితాలు విడుదలవ్వగా ఓ టికెట్‌కు రూ.కోటిన్నర లాటరీ తగిలింది. దీంతో కోటీశ్వరులు అయిపోయిన వారిద్దరూ బ్యాండుతో లాటరీ సెంటర్‌కు వచ్చారు. డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేశారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, అధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చుచేస్తామని తెలిపారు.