959
హైదరాబాద్ రామంతాపూర్ పరిధిలోని వివేక్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. హోమ్‌వర్క్ చేయలేదని టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి హేమంత్ మృతి చెందాడు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఇవాళ చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు. దీంతో రామంతాపూర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అనంతరం మృతదేహన్ని అంత్యక్రియలు కోసం వనపర్తికి తరలించారు. మరోవైపు గతం వారం రోజులుగా హేమంత్ జ్వరంతో ఇబ్బంది పడ్డాడని ఉప్పల్ పోలీసులు తెలిపారు. జ్వరంతో మృతి చెందాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.