245
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి 200 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన నలుగురు మరణించారు, మరో నలుగురు గాయపడ్డారు. అమరావతి జిల్లా చిక్కల్‌దరా ఘాట్‌రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాహన డ్రైవర్ షేక్ సల్మాన్ (28), గొల్లి వైభవ్ యాదవ్ (28), నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి శివకృష్ణ (31), వనపర్తి కోటేశ్వర్రావు (27) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్యాంసుందర్‌రెడ్డి ( ఖమ్మం), సుమన్ (రాజమండ్రి), ముత్తినేని హరీశ్ (నల్గొండ), యోగేష్యాదవ్ (మిర్యాలగూడ) గాయపడ్డారు. కాగా, వీరిలో యోగేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరగగా స్థానికుల సాయంతో పోలీసులు గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు.