అమాయకుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన సింగరేణి బ్లప్ మాస్టర్ తన వలలో బాదితులు పడేందుకు అనేక ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇతని గురించి బాదితులు అనేక విషయాలు చెబుతున్నారు. ఉద్యోగాల దగ్గర్నుంచి ప్రమోషన్లు, బదిలీలు, ప్రభుత్వంలో ఎలాంటి పనైనా చేస్తానని చెప్పి నమ్మించే సింగరేణి బ్లప్ మాస్టర్ తన వద్దకు వచ్చిన బాదితులు నమ్మేలా అనేక మాయమాటలు చెప్పడంతో పాటు సెక్రటరీయేట్ వద్ద స్కెచ్‌లు వేసేవాడని తెలుస్తోంది. సుమారు రూ.70 కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడి ఎనిమిది నెలల కాలంగా తప్పించుకుని తిరుగుతున్న హరికిషన్ దాస్ అమాయకులను నమ్మించేందుకు అనేక సిత్రాలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ – 1 ఆపీసర్‌గా చెబుతూ..
తనవద్దకు వచ్చే బాదితులకు తాను అన్ని పనులు చేస్తానని చెప్పే హరికిషన్ దాస్ తనకు తానుగా గ్రూప్ – 1 ఆపీసర్ నంటూ బాదితులకు చెప్పేవారని తెలుస్తోంది. ఆరోగ్య శాఖకు సంబందించి సెక్రటరీయేట్‌లో తనకు పోస్టు అన్ని నమ్మబలికినట్లు సమాచారం. తాను చెప్పిందంతా నిజంలా నమ్మించేందుకు వచ్చే బాదితులను నేరుగా హైదరాబాద్‌లోని అప్పటి సెక్రటరీయేట్‌గా నడిచిన బీఆర్కె భవన్‌కు బాదితులను పిలిపించుకునేవాడని తెలుస్తోంది. కాగా హరికిషన్‌దాస్‌కు బీఆర్కె భవన్‌కు సంబందించిన కొంత మంది సెక్యూరిటీ సిబ్బంది సహకరించినట్లు సమాచారం. బాదితులు బీఆర్కె భవన్ వద్దకు రాగానే అక్కడ తన వాళ్లైన సెక్యూరిటీ సిబ్బంది సహకారంతో నేరుగా పాసులు లేకుండానే సెక్రటరీయేట్‌లోకి తీసుకెళ్లేవాడని సమాచారం. ఆ తర్వాత తన వద్ద ఉన్న నకిలీ చీఫ్ సెక్రటరీ లెటర్ హెడ్స్, సింగరేణి సీఎండీ లెటర్ హెడ్స్ చూపించి తన వద్దకు వచ్చే బాదితులకు సంబందించిన అధికారి లేడని బయటకు వెళ్లి మాట్లాడుకుందామని వారిని బయటకు తీసుకొచ్చేవాడని బాదితులు చెబుతున్నారు. ఈ తతంగం అంతా చూసిన బాదితులు నిజంగానే హరికిషన్ దాస్ గ్రూప్ – 1 ఆపీసర్ అని నమ్మడంతో వారితో బేరమాడుకునేందుకు పక్కనే ఉన్న టీస్టాల్‌కు తీసుకెళ్లి వారి వద్ద నుంచి డబ్బులు తీసుకునేవాడని తెలుస్తోంది. అయితే హరికిషన్‌దాస్‌కు సహకారం అందించిన బీఆర్కె భవన్ సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నిస్తే ఈ వసూళ్ల పర్వంలో ఉన్న మరింత మంది బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఒక్క మర్డర్ కేసులో నిందితుడిగా ఉంటూ బెయిల్‌పై బయట తిరుగుతున్న హరికిషన్‌దాస్ పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడం చూస్తే ఆయన వెనుక బలమైన శక్తులు ఉన్నట్లే బాదితులు బావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తను అనుకున్న విదంగా బాదితుల నుంచి డబ్బులు రాబట్టేందుకు హరికిషన్ దాస్ అనేక అవతారాలు ఎత్తి సినిమా సై్టల్‌లో బాదితుల నుంచి డబ్బులు రాబట్టేవాడని తెలుస్తోంది. అమాయకులను నిలువునా మోసం చేసి కోట్లలో కూడబెట్టుకుని ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్న హరికిషన్‌దాస్‌ను పోలీసులు పట్టుకోలేకపోవడంలో బాదితులకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సింగరేణి బ్లప్ మాస్టర్‌కు సంబందించి మరిన్ని కథనాలు త్వరలో అందిస్తాం.
కోలకాని నవీన్‌కుమార్,
సీనియర్ కరస్పాండెంట్, న్యూస్ 360, ఖమ్మం