team india
Home » wivind:భారత్‌ ఓటమి.. డ్రింక్స్‌ బాయ్‌గా కోహ్లి

wivind:భారత్‌ ఓటమి.. డ్రింక్స్‌ బాయ్‌గా కోహ్లి

by admin
0 comment

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో (WIvIND) భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్‌ కిషాన్ (55) టాప్ స్కోరర్‌. అనంతరం ఛేదనకు దిగిన విండీస్‌ 36.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఫామ్‌ను కొనసాగిస్తూ ఇషాన్ కిషాన్‌ మరోసారి అర్ధశతకం చేశాడు. శుభమన్‌ గిల్‌ (34)తో కలిసి తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అయితే అనంతరం 91 పరుగుల వ్యవధిలోనే భారత జట్టు పది వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ , విరాట్‌ కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో జట్టులోకి వచ్చిన సంజు శాంసన్‌ (9), అక్షర్‌ పటేల్‌ (1) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. మొటీ, షెఫార్డ్‌ చెరో మూడు వికెట్లు తీయగా, జోసెఫ్‌ రెండు, సీల్స్‌, కరియా తలో వికెట్‌ తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన విండీస్‌ దూకుడుగానే ఆడింది. బ్రాండన్‌ కింగ్‌ (15) తో కలిసి మేయర్స్‌ (36).. 8.2 ఓవర్లలోనే అర్ధశతకం భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే శార్దూల్‌ ఠాకూర్‌ ధాటికి విండీస్‌ స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోయి 91/4 స్థితిలో నిలిచింది. కానీ కార్టి (48*)తో కలిసి కెప్టెన్ హోప్ (63*) జట్టును ఆదుకున్నారు. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు.

డ్రింక్స్‌ బాయ్‌గా కోహ్లి
రెండో వన్డేకు కెప్టెన్‌ రోహిత్‌తో పాటు విశ్రాంతి తీసుకుని తుది జట్టుకు దూరమైన విరాట్‌ కోహ్లి (Virat Kohli) డ్రింక్స్‌ బాయ్‌ అవతారం ఎత్తాడు. భారత ఇన్నింగ్స్‌లో 37వ ఓవర్‌ అనంతరం డ్రింక్స్‌ విరామంలో స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో కలిసి శీతల పానీయాలు తీసుకుని అతను మైదానంలోకి వెళ్లాడు. క్రీజులో ఉన్న శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లకు వీళ్లిద్దరూ పానీయాలు అందించారు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links