276
రిలయన్స్ జియో నుంచి బడ్జెట్ ల్యాప్‌టాప్ వచ్చేస్తుంది. కొత్త జియో బుక్ (New JioBook) ఆగస్టు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్లతో పాటు అమెజాన్ (Amazon) వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. బ్లూ రంగులో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ బరువు 990 గ్రాములే. దీనిలో జియోఓఎస్ ఇంటర్‌ర్‌ఫేస్‌తో 4జీ కనెక్టివిటీ ఉండనుంది. ఒక రోజంతా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని జియో చెబుతోంది. దీని ధర 16,499గా ప్రకటించింది.
మరిన్ని ఫీచర్లు
ఈ కొత్త ల్యాప్‌టాప్‌లో 2.0 GHz octa core ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ, 11.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే అమర్చారు. ఈ కొత్త ల్యాప్‌టాప్ విద్యార్థులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దారు.