sea
Home » సీఫుడ్‌ అతిగా తింటే కాన్సర్‌ వస్తుందా?

సీఫుడ్‌ అతిగా తింటే కాన్సర్‌ వస్తుందా?

by admin
0 comment

సీఫుడ్‌ అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తుంటాం. దీనిలో విటమిన్లతో పాటు మనకి కావాల్సిన ఎన్నో పోషక పదార్థాలు లభిస్తుంటాయి. అయితే అతిగా సీపుడ్‌ తింటే వాటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ వల్ల కాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తుంటారు. మరి దానిపై నిజనిజాలేంటో ఒకసారి చూద్దాం!

మైక్రో ప్లాస్టిక్‌ అనేది కేవలం చేపల్లోనే కాదు, ప్రతి దానిలోనూ కలిసి ఉంటాయి. సీఫుడ్‌లో మైక్రోప్లాస్టిక్‌తో పాటు పాదరసం ఆరోగ్యానికి నష్టం కలిగిసిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వీటికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రొటీన్‌ను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అయితే అన్ని చేపల్లోనూ మనకి హాని కలిగించే పదార్థాలు ఉండవు. కొన్నింటిలో అవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వాటిని మాత్రమే తినకుండా ఉంటే సరిపోతుంది.

చిన్న చేపలు, పీతలు, నత్తలు, నెత్తళ్లు లాంటి వాటి జీర్ణకోశాన్ని శుభ్రం చేయలేం. వాటిని పైపైన కడిగి తినేస్తుంటాం. దీని వల్ల విషపూరిత ఖనిజాలు శరీరంలోకి ఎక్కువగా చేరే ప్రమాదం ఉంటుంది. కానీ పెద్ద చేపలను పూర్తిగా కోసి శుభ్రం చేస్తుంటాం కాబట్టి ఇవి తినొచ్చు. పైన చెప్పిన వాటితో పోల్చితే వీటితో సమస్య తక్కువగా ఉంటుంది. అయితే దీన్ని సమతుల్యం చేయడానికి రోజులో ఏదో ఒక పూట గింజలు, తృణధాన్యాలు, మాంసకృత్తులు, గుడ్డు లాంటివి తింటే సరిపోతుంది. అంతేకానీ చేపలు తినడాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links