Home » Ugram Movie Review – ఉగ్రం మూవీ రివ్యూ

Ugram Movie Review – ఉగ్రం మూవీ రివ్యూ

by admin
0 comment

థ్రిల్లర్లు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. రీసెంట్ గా వచ్చిన విరూపాక్ష ఏ రేంజ్ థ్రిల్ అందించిందో కూడా చూశాం. ఈరోజు రిలీజైన యాక్షన్ థ్రిల్లర్ ఉగ్రం కూడా అలాంటి సీట్ ఎడ్జ్ థ్రిల్ అందిస్తుందని ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంది, థ్రిల్ తక్కువగా ఉంది.

ఇలాంటి సినిమాలకు పేపర్ పై వర్క్ ఎక్కువగా చేయాలి. టేబుల్ పై సీన్స్ ఎంత బాగా రాసుకుంటే, సినిమా అంత బాగుంటుంది. ఉగ్రంలో అదే మిస్సయింది. ఇది పూర్తిగా దర్శకుడి ఫెయిల్యూర్. సినిమా బాగానే స్టార్ట్ అవుతుంది. అంతలోనే రొటీన్ ఛైల్డ్ సెంటిమెంట్ టర్న్ తీసుకుంటుంది. మనుషులు మిస్సింగ్ అనే పాయింట్ నే ఎంగేజింగ్ గా నడిపితే బాగుండేది. కానీ సగటు మాస్ సినిమాలా మధ్యలో సాంగ్స్, యాక్షన్ బ్లాక్స్ పెట్టి థ్రిల్ మిస్ చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల.

అయితే ఉన్నంతలో సినిమా నిలబడ్డానికి కారణం సెకెండాఫ్. రెండో భాగంలో సినిమా పరుగులుపెడుతుంది. కథకు జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. భారీ ఫైట్లు, అక్కర్లేని విధంగా పెట్టిన సెంటిమెంట్ సీన్లు ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ కాగా.. అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, ఓపెనింగ్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్.

ఓవరాల్ గా ఉగ్రం సినిమా ఎక్కువ యాక్షన్, తక్కువ థ్రిల్స్ తో తెరకెక్కింది. డైరక్షన్ లోపాలు, లాజిక్ లేని కొన్ని సన్నివేశాల్ని మినహాయిస్తే, అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాను ఓసారి చూడొచ్చు.

రేటింగ్ – 2.5/5

You may also like

Leave a Comment

Live TV

WhatsApp_Image_2023-03-25_at_17.43.26-removebg-preview

తాజా వార్తలు

Useful Links